• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

ఎంపికైన కానిస్టేబుళ్లకు వెంటనే శిక్షణ ఇవ్వాలి

Published on : May 9, 2020 at 10:48 am

చల్లా వంశీచంద్ రెడ్డి
మాజీ ఎమ్యెల్యే, ఏఐసీసీ కార్యదర్శి..

 

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం

కానిస్టేబుళ్లుగా నియామకం అయ్యి కూడా శిక్షణకు నోచుకోకుండా ఉన్న 4,203 మంది(TSSP) మనోవేదనను మీ దృష్టికి తెస్తూ…..

2018 లో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక కోసం 18,000 పోస్టుల భర్తీ కై ఉద్యోగ నియామక ప్రకటన ఇచ్చింది. అందులో లక్షలాది మంది అర్హత గల నిరుద్యోగ యువకులు దరఖాస్తు చేసుకున్నారు. వారికి అనేక రకాల వడపోతలు, రాత పరీక్షలు, శారీరక పరీక్షలు, పరుగు పరీక్షలు ఇలా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించి 18000 మంది నిరుద్యోలను పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపిక చేసారు. అయితే ఇందులో 4,203 మంది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రీక్యూట్మెంట్ బోర్డు ద్వారా నియామకం అయ్యారు. వీరు కాకుండా మిగతా 14 వేల మంది ఏ ఆర్, సివిల్ అభ్యర్థులకు మాత్రం ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. TSSP పోలీస్ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి శిక్షణ కు సంబంధించిన సమాచారం లేదు. ఈ కరోనో సమయంలో కూడాCIVIL,AR,SPF, COMMUNICATION,JAIL WARDARS వారికి శిక్షణ ఇస్తున్నారు. కానీ TSSP కానిస్టేబుల్స్ కి శిక్షణ విషయంలో ప్రభుత్వం కానీ,తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రెక్కుట్మెంట్ బోర్డు కానీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.వారు పని చేసుకుందాం అంటే ఏదైనా సమస్య ఉత్పన్నం అయి మెడికల్ గా అనర్హులం ఆవతమేమో అనే భయం తో,ఉద్యోగులుగా ఎంపికయ్యి కూడా నిరుద్యోగులుగా ఉండడంతో వారి ఆవేదన వర్ణనాతీతం.
TSSP అభ్యర్థుల శిక్షణ ఒకవేళ ఇంకా ఎక్కువ కాలం ఆలస్యం అయిన పక్షంలో, వారు సర్వీస్ కోల్పోతామనే భయాందోళనలో ఉన్నారు.
అందువల్ల ఈ విషయంలో మీరు సహృదయంతో స్పందించి తగిన చర్యలు తీసుకొని 4,203 తెలంగాణ బిడ్డలను ఆదుకొని వారికి వెంటనే శిక్షణ ఇప్పించగలరని కోరుతున్నాను

tolivelugu app download

Filed Under: చెప్పండి బాస్..

Primary Sidebar

ఫిల్మ్ నగర్

విజ‌య్ మాస్ట‌ర్ డిజిట‌ల్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్

విజ‌య్ మాస్ట‌ర్ డిజిట‌ల్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్

తక్కువ ధరకే కార్లు... యంగ్ హీరోపై కేసు నమోదు

తక్కువ ధరకే కార్లు… యంగ్ హీరోపై కేసు నమోదు

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

ఇండియా విజయంపై మహేష్ వెంకీలు ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

బాలయ్య కు థాంక్స్ చెప్పిన అల్లరి నరేష్

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

మాస్టర్ ఆ మార్క్ కూడా క్రాస్ చేసిందా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

బ‌డ్జెట్ టైం.. ఈనెల 30 అఖిల‌ప‌క్ష స‌మావేశం

బ‌డ్జెట్ టైం.. ఈనెల 30 అఖిల‌ప‌క్ష స‌మావేశం

ఇండియా క‌రోనాః కొత్త కేసులు13,823..కొత్త స్ట్రెయిన్ 141

ఇండియా క‌రోనాః కొత్త కేసులు13,823..కొత్త స్ట్రెయిన్ 141

తెలంగాణ‌లో కొత్త‌గా 267 మందికి పాజిటివ్

తెలంగాణ‌లో కొత్త‌గా 267 మందికి పాజిటివ్

ప‌దోసారి చ‌ర్చ‌లు.. ప‌రిష్కారం అనుమాన‌మే!

ప‌దోసారి చ‌ర్చ‌లు.. ప‌రిష్కారం అనుమాన‌మే!

కాళేశ్వ‌రం టూర్.. క్యా మ‌త్‌ల‌బ్?

కాళేశ్వ‌రం టూర్.. క్యా మ‌త్‌ల‌బ్?

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే...

ఏపీలో క‌రోనా కొత్త కేసులెన్నంటే…

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)