పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కొందరు నేతలతో కలిసి తీవ్ర వ్యాఖ్యలు చేయటం, టీఆర్ఎస్ కు మేలు చేసేలా కామెంట్స్ ఉండటం, మీడియాతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్న అంశాలపై వివరణ కోరనుంది.
మధ్యాహ్నం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం గాంధీభవన్ లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జగ్గారెడ్డి వివరణ కోరటంతో పాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ముందు నుండి అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దని పట్టుబట్టిన వారిలో జగ్గారెడ్డి కూడా ఒకరు.