ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు తమ విద్యను కొనసాగించడంలో సహాయం చేయాలని ఏఐసీటీఈ తన అనుబంధ వర్సిటీలు, సంస్థలకు సూచించింది. ఈ మేరకు వాటికి ఏఐసీటీఈ లేఖ రాసింది.
‘ మీకు తెలుసు. ఉక్రెయిన్ లో యుద్ధం నేపథ్యంలో సుమారు 20000ల మందికి పైగా భారతీయ ఆ దేశం నుంచి వచ్చేశారు. అక్కడ వారంతా మెడిసిన్, ఇంజినీరింగ్ విద్యను కొనసాగిస్తు్న్నారు. ఉక్రెయిన్ లో యుద్ధం నేపథ్యంలో వారి విద్యా భవిష్యత్ అనిశ్చితిలో ఉంది. అందువల్ల వారంతా డిప్రెషన్ లో ఉన్నారు’ అని లేఖలో ఏఐసీటీఈ పేర్కొంది.
‘ ఈ విషయం ఇప్పటికే పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. ఇండియాలో తమ విద్యను కొనసాగించాలనుకునే వారందరికీ అన్ని విద్యా అవకాశాలను సులభతరం చేస్తామని భారత ప్రభుత్వం హామి ఇచ్చింది. వేలాది మంది భారతీయుల భవిష్యత్ ను విస్మరించబోమని ప్రభుత్వం వెల్లడించింది’ ‘ అని పేర్కొంది.
అందువల్ల వర్సిటీల్లో ఖాళీగా ఉన్న సీట్లలో వారిని చేర్చుకునే అంశంపై పరిశీలన చేయాలని వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లను సాంకేతిక విద్యా నియంత్రణాధికారి కోరారు.