కరోనా వైరస్ కోరల నుండి బయటపడాలంటే మరో 8 వారాలు అలర్ట్ గా ఉండాలని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డా.గులేరియా హెచ్చరించారు. ప్రస్తుతం దేశంలో వైరల్ లోడ్ తక్కువగానే ఉందని, అయితే, రాబోయే 8వారాలు ప్రజలంతా అలర్ట్ గా ఉండి కరోనా నిబంధనలు పాటిస్తే సేఫ్ గా బయటపడొచ్చని తెలిపారు.
ఈ 8వారాల లోపు జనం అంతా వ్యాక్సిన్ తీసుకోవాలని… వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా సోకినా అతి తక్కువ లక్షణాలతో బయటపడొచ్చని డా.గులేరియా అభిప్రాయపడ్డారు. ప్రస్తతుం వైరస్ తీవ్రత తగ్గుతుందని, ఈ సందర్భంలో జనం అప్రమత్తంగా లేకపోతే వైరస్ మళ్లీ విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఐసీఎంఆర్, అమెరికా ఎఫ్డీఎ సూచనల మేరకు కరోనా చికిత్సలో జరుగుతున్న మార్పులను జాగ్రత్తగా గమనించాలన్నారు.