ఎయిమ్స్ సీనియ‌ర్ డాక్ట‌ర్ ను బ‌లితీసుకున్న‌క‌రోనా - Tolivelugu

ఎయిమ్స్ సీనియ‌ర్ డాక్ట‌ర్ ను బ‌లితీసుకున్న‌క‌రోనా

ఆయ‌నో సీనియ‌ర్ డాక్ట‌ర్. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల్లో నిష్ణాతుడు. ప్ర‌స్తుతం ఎయిమ్స్ లో పల్మ‌నాల‌జీ విభాగానికి డైరెక్ట‌ర్ కూడా. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ కూడా ఈ ఊపిరితిత్తుల‌పైనే దాడి చేస్తుంది. దీంతో కొన్ని రోజులుగా డాక్ట‌ర్ జె.ఎన్ పాండే క‌రోనా వైర‌స్ పై పోరాటంలో ప‌నిచేస్తున్నారు.

కానీ చివ‌ర‌కు ఆయ‌న కూడా క‌రోనా వైర‌స్ కు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. క‌రోనా వైర‌స్ పై పోరాటంలో ముందు వ‌రుస‌లో ఉన్న ఆయ‌న అదే కరోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. డాక్టర్ పాండే మృతిపై ఎయిమ్స్ వైద్యులతో పాటు వైద్య వృత్తితో సంబంధం ఉన్న వారంతా దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp