ట్రాక్టర్ల ర్యాలీ రైతు సంఘాల్లో చీలకకు దారి తీసింది. రిపబ్లిక్ డే సందర్భంగా చేపట్టిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీ గణతంత్ర దినోత్సవాన్ని కించపర్చాలన్నది తమ ఉద్దేశం కాదని, శాంతియుతంగా ఉద్యమం చేయాలని భావించామని ఏఐకేఎస్సీసీ కన్వీనర్ వీఎం సింగ్ ప్రకటించారు. రాకేష్ తికాయత్ తో కలిసి తాము ఇక ఉద్యమం చేయలేమన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాము ఆందోళనలో కొనసాగలేమన్న సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన ఆయన, రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశాలు వేరుగా ఉన్నాయన్నారు. అయితే, తాము రైతుల కోసం చేస్తున్న పోరాటం కొనసాగుతుందని, రైతుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు.