దేశంలో కరోనా వైరస్ కోరలు చాచుతోంది. మరో రెండు వారాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ తో మరణాలు సంభవిస్తున్న తరుణంలో… ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
కరోనా వైరస్ అనేది జాతీయ విపత్తు వంటిది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ తో చనిపోయిన వారంతా అమరవీరులేనని… వారికి ఖననం చేసే ముందు ఆయా మతాల వారిగా చేసే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి అంత్యక్రియల కోసం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.
కేంద్ర జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చనిపోయిన వ్యక్తి బంధువుల్లో దగ్గరి వారు మాత్రమే అంత్యక్రియలకు హాజరు కావాలని, మృతదేహాన్ని తాకటం కానీ, హాత్తుకోవటం కానీ చేయవద్దని… అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటంతో పాటు స్థానిక అధికారుల సమక్షంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని సూచించింది.
ఇటీవల తెలంగాణ సహా దేశంలో జరుగుతున్న కరోనా వైరస్ మరణాలు ఎక్కువగా… ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, వారి సన్నిహితులే ఉండటంతో… ఎంఐఎం అధినేత ఓవైసీ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.