గ్రేటర్ హైదరాబాద్ లోని కేవలం నాలుగు జోన్లలోనే కరోనా కేసుల సంఖ్య ఉందని, రాష్ట్రంలో మరెక్కడా కరోనా వైరస్ జాడలేదని సీఎం ప్రకటించిన మరుసటి రోజే ఎంఐఎం ఎమ్మెల్యే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. పక్కనే పోలీసులున్నా… దౌర్జన్యంగా ఫ్లైఓవర్ పై వెళ్లకుండా ఉన్న బారికేడ్స్ తొలిగించాడు.
మలక్ పేట, ఎల్బీనగర్, కార్వాన్, వనస్థలిపురం డివిజన్లు డేంజర్ జోన్లలో ఉన్నాయని, అక్కడ కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించాడు. కానీ మలక్ పేట్ డివిజన్ లో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి పోలీసులపై దౌర్జన్యం చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించాడు.
ఇప్పటికే పలువురు ఎంఐఎం నేతలు పోలీసులకు సహకరించకుండా, వారిని అడ్డుకుంటున్న వీడియోలు వార్తలు వస్తున్నాయి. పైగా ఆయా ఏరియాల్లో కేసులు పెరుగుతున్నాయి. అలాంటి చోట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై బీజేపీ సహా పలువురు మండిపడుతున్నారు.