ఎంఐఎంతో మిత్రపక్షంగా ఉంటున్న అధికార టీఆర్ఎస్ పై ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తలుచుకుంటే తెరాస ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 2 నెలల పని అంటూ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ కామెంట్ చేయటం సంచలనం రేపుతోంది. రాజకీయాల్లో కేటీఆర్ ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్నారన్నారు.
ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీ చెప్పిన మాటలు గుర్తు చేసిన ముంతాజ్… రాజకీయం ఎంఐఎంకు కొత్తకాదని, ఇలాంటి ప్రభుత్వాలను ఎంఐఎం ఎన్నో చూసిందన్నారు. ఎంఐఎం తల్చుకుంటే గ్రేటర్ ఎన్నికల్లోనే కాదు తెరాస పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఎంఐఎంను పార్టీలు విమర్శించడం కొత్తేమీ కాదు.. అలాచేసి ఎన్నో పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయన్నారు.
ఎంఐఎంతో అంటకాగుతున్నారని విమర్శలు వస్తున్న సమయంలో కేటీఆర్ ను ఎంఐఎం టార్గెట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.