ఫ్రెండ్లీ కంటెస్ట్ లో ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రోజు రోజుకు ప్రచ్ఛన్న యుద్ధం పెరిగిపోతుంది. అధినేతలు బాగానే ఉన్నా… కిందిస్థాయి నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా అక్బర్‌బాగ్ డివిజన్ సపోటాబాగ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని స్థానిక ఎంఐఎం నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మైనార్టీలు అధికంగా ఉండే సపోటాబాగ్ బస్తీలో టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. సైదాబాద్ పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం టీఆర్‌ఎస్ తిరిగి ప్రచారం ప్రారంభించింది.