పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా గణన పేరుతో పౌర జాబితా వంటి అంశాలను వ్యతిరేకిస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ను కలవబోతున్నారు.
టీఆర్ఎస్ పార్టీ క్యాబ్ బిల్లును ఇప్పటికే వ్యతిరేకించింది. అయితే… టీఆర్ఎస్ నామమాత్రంగానే వ్యతిరేకించిందని, ఓ వైపు క్యాబ్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌లు సైలెంట్ అయిపోయాయి. దీంతో మీ వైఖరి ఏంటీ అంటూ సీఎం కేసీఆర్‌ను ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు నిలదీశాయి.
ఇలాంటి సమయంలో… ఎంఐఎం అధినేత కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలవబోతున్నారు. ఆలిండియా ముస్లిం యాక్షన్ కమిటీ ఆద్వర్యంలో దేశవ్యాప్త మద్దతు కూడగడతామని ఎంఐఎం స్పష్టం చేస్తుంది.
అయితే, సీఎం కేసీఆర్ బీజేపికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు మద్దతిస్తారా…? ఎలాగు క్యాబ్‌ను వ్యతిరేకించాం కాబట్టి సైలెంట్‌గా ఉంటారా…? రాష్ట్రంలో ఎన్నార్సీ అముల చేయమని ప్రకటిస్తారా…? అసలే మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.