హిందువులపై యూపీ ఎంఐఎం అధ్యక్షుడు షౌకత్ అలీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దీనిపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్బర్ జోధాబాయిని వివాహం చేసుకున్నాడని, తమ కన్నా సెక్యులర్ ఎవరున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలు రెండు వివాహాలు చేసుకున్నా ఇద్దరు భార్యలకు సముచిత స్థానం ఇస్తారని అన్నారు. అయితే హిందువులు మాత్రం ఒక్కరినే వివాహం చేసుకుంటారని, ముగ్గురితో ఎఫైర్ పెట్టుకుంటారని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
832 ఏండ్ల పాటు హిందువులను ముస్లింలు పాలించారని, ముస్లిం పాలకులకు హిందువులు జీ హుజూర్ అంటూ సలాం చేశారని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు చర్యలకు దిగారు.
హిందువులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మత విద్వేషాలు రెచ్చ గొట్టేల వ్యాఖ్యలు చేశారని ఆయన పై కేసులు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యలపై షౌకత్ అలీ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఏ మతానికి వ్యతిరేకం కాదని ఆయన అన్నారు.