కొందరు తమకు తోచిన సామాజిక అంశాలను, మనసు తొలిచే చేదు అనుభవాలను,చూసిన ప్రదేశాల అనుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటూ ఉంటారు.దీనికి కాస్త హాస్యాన్ని జోడించి ఆకట్టుకోవడంతోపాటు ఆయా అంశాలపై తమవైన అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకుంటూ ఉంటారు.
నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ఇదే కోవలోకి వచ్చే వ్యక్తి. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ రిసార్ట్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. పూర్తిగా మంచుతోకప్పబడి ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి ఇదేదో స్విట్జర్లాండో, జమ్ముకశ్మీరో అనుకోకండి.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘అనిని’ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ‘చిగు’ రిసార్టు. చాలా అద్భుతమైన ప్రాతం కదా! అంటూ అందులో రాసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏమండీ పెమాఖండూ గారూ.. ఆ సుందర ప్రదేశానికి తనను ఎప్పుడు ఆహ్వానిస్తారు? అంటూ ముగించారు. ఎవరైనా అక్కడికి వెళ్లాలనుకుంటే https://arunachaltourism.com వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
ये हसीं वादियां…!😍
This ain't Switzerland nor Kashmir!
This is the newly completed Chighu Resort at Anini, Arunachal Pradesh. Such a wonderful site! Isn't it?@PemaKhanduBJP Ji when are you inviting me ?
To visit, contact: https://t.co/dg7PdIAkrn#AmazingNortheast pic.twitter.com/CKbGAtzrXo
— Temjen Imna Along (@AlongImna) January 28, 2023