ఆకాశంలో ఎక్కడో ప్రయాణించాల్సిన విమానం అకస్మాత్తుగా మీరు ప్రయాణించే రోడ్డు మీద మీ వైపే వస్తే.. మీరేం చేస్తారు ? అలాంటి స్థితిలో ఎవరు ఉన్నా సరే.. వారి పై ప్రాణాలు పైనే పోతాయి. విమానం రోడ్డు మీదకు వస్తే అక్కడే ఎవరైనా ఉంటే అసలు ఏమాత్రం కూడా ప్రమాదంలో బతికే అవకాశాలు ఉండవు. కానీ ఆ వ్యక్తి మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయట పడ్డాడు. ఓ విమానం రోడ్డు మీదకు వచ్చి ఎమర్జెన్సీ ల్యాండ్ అయి కారును ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడం విశేషం.
అమెరికాలోని మినియాపోలిస్‌లో సిటీ హైవేపై సడెన్‌గా ఓ విమానం ల్యాండ్ అయింది. అది సింగిల్ ఇంజిన్ ఉన్న ప్లేన్. బెల్లాంకా వైకింగ్ అనే ఎయిర్‌క్రాఫ్ట్ అది. సడెన్ గా ప్లేన్ హైవేపై ల్యాండ్ అయింది. ల్యాండ్ అవుతూనే అదే రహదారిపై వెళ్తున్న ఓ కారును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.
Highway cameras captured the moment a small plane made an emergency landing on a Minnesota highway and struck a car as motorists slammed on their brakes pic.twitter.com/UnMuBxyMyW
— Reuters (@Reuters) December 4, 2020
Advertisements
కాగా విమానం అలా హైవేపై ల్యాండ్ అవుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సంఘటనలో బతికి బయట పడ్డ పైలట్‌తో ఆ కారులో ప్రయాణిస్తున్న బ్రిటానీ యురిక్ అనే వ్యక్తి మాట్లాడాడు. సదరు పైలట్ యురిక్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు. అనుకోని కారణాల వల్ల విమానాన్ని రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించాల్సి వచ్చిందని, యాక్సిడెంట్ చేసినందుకు సారీ అని యురిక్‌కు పైలట్ క్షమాపణలు చెప్పాడు. అయితే యురిక్ కూడా పైలట్‌ను ఏమీ అనలేదు.
ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది 2020 కదా ఏమైనా జరగొచ్చు, మీ కారు రియర్ వ్యూ మిర్రర్‌లో విమానాన్ని చూసి మీరు భయపడవచ్చు, పైలట్ చక్కగా ల్యాండింగ్ చేశాడు, గుడ్.. అని పలువురు కామెంట్లు పెట్టారు.