ఓ సామాన్య పైలెట్ ఎయిర్ డెక్కన్ అధినేతగా ఎలా ఎదిగాడు… పట్టుదల, ఆలోచన, తెగింపు ఉంటే కలను సాధ్యం చేసుకోవచ్చని నిరూపించిన ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపినాథ్ బయోగఫ్రీ సింప్లి ఫ్లై ఆధారంగా తెరకకెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా. ఈ మూవీ చూసిన గోపినాథ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఫిక్షన్ ఎక్కువగా ఉన్నప్పటికీ నా పుసక్తంలోని ఎమోషన్స్‌ను క్యారీ చేశారన్నారు. మూవీ చూస్తున్నంత సేపు నాకు నవ్వు రాలేదు.. ఏడుపు కూడా రాలేదు. కానీ నాకు నా గతం గుర్తుకొచ్చిందన్నారు. అసమానతలతో వెనుకబడిన గ్రామీణ నేపథ్యం ఉన్న ఒక పారిశ్రామికవేత్త యొక్క పోరాటాలు, కష్టాలకు వ్యతిరేకంగా సాధించిన నిజమైన విజయం. నా భార్య భార్గవి పాత్రను అపర్ణ చక్కగా చేసింది. తన స్వబుద్ధితో ఆలోచించే బలమైన మనస్తత్వంతో పాటు మృదుస్వభావి. గ్రామీణ మహిళలకు స్ఫూర్తినిచ్చే మనస్తత్వం కల వ్యక్తిగా చక్కగా చూపించారు. తన కలను నిజం చేసుకునే ఓ పిచ్చి, ప్యాషన్‌తో వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడనే చూపించే నా పాత్రను సూర్య అద్భుతంగా చేశారు. ఇక డైరెక్టర్ సుధా కొంగరకు హ్యాట్సాఫ్. సూర్య, అపర్ణ పాత్రలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారన్నారు.
అమెజాన్ ప్రైంలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.