ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. తిరువనంతపురం నుంచి ఒమన్ లోని మస్కట్ కు బయలుదేరింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆన్ బోర్డ్ కంప్యూటర్ సిస్టమ్ లో సాంకేతిక లోపం కారణంగా తిరిగి వచ్చింది.
ఐఎక్స్ 549 నంబరు ఎయిర్ ఇండియా విమానం కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురం విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 8.30 గంటలకు బయలు దేరింది. పైలట్ విమానంలో వెంటనే సాంకేతిక లోపాన్ని గుర్తించాడు.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఉదయం 9.17 గంటలకు తిరిగి అదే విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. ఈ విమానంలో 105 మంది ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. విమానయాన సంస్థ ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది.
తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుందని అధికారులు చెప్పారు. ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు.