ఈశాన్య ఉక్రేనియన్ నగరం సుమీలో చిక్కుకున్న విద్యార్థులను తీసుకుని వస్తున్న ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.
పొలాండ్ లోని జెస్జో నగరం నుంచి గురువారం రాత్రి 11.30 గంటలకు ఈ విమానం బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విమానం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
సుమీలో చిక్కుకున్న 600 మంది విద్యార్థులను భారత్ కు తరలించేందుకు మొత్తం మూడు విమానాలను పంపినట్టు చెప్పారు. మరో విమానం శుక్రవారం ఉదయం 9 గంటల వరకు భారత్ కు చేరుకుంటుందని వివరించారు.
ఈ విమానాల్లో మొదటి ఫ్లైట్ ను మొదటి, రెండో, మూడో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థుల, రెండో విమానాన్ని నాల్గవ, ఐదో సంవత్సరం విద్యార్థుల, మూడో విమానాన్ని ఐదవ, ఆరవ సంవత్సరం విద్యార్థులు, ఇంకా ఉక్రెయిన్ లో మిగిలిన వారి కోసం పంపినట్టు తెలిపారు.