ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఎయిర్ ఇండియా మూసివేతపై పార్లమెంట్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పౌర విమాన యాన శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పురి సమాధానమిస్తూ…ఎయిర్ ఇండియాను ప్రవేటీకరించకపోతే నడపడం కష్టమని చెప్పారు. ప్రైవేట్ రంగ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించే ప్రక్రియను హోం, ఆర్ధిక శాఖ మంత్రి మొదలుపెట్టారన్నారు. గత కొన్ని ఏళ్లుగా సంస్థ నష్టాల్లో ఉందని తెలిపారు. ఎయిర్ ఇండియా లో మొత్తం 9,400 మంది పర్మినెంట్ ఉద్యోగులుండగా…4200 మంది కాంట్రాక్ట్ వర్కర్లున్నారు.