యాపిల్ ఉత్పత్తులు వినియోగదారులకు ప్రాణాలను కాపాడతాయనేది పలు సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. యాపిల్ వాచ్ ఎక్కువగా ప్రాణాలను రక్షించడంలో పేరు పొందింది. ఇక ఎయిర్‌పాడ్‌లు కూడా మహిళలకు అండగా నిలుస్తూ ఉంటాయి. అమ్మాయిల హెయిర్ స్టైల్ లూస్ హెయిర్ అయితే ఎయిర్ పాడ్ చెవిలో ఉన్న విషయం కూడా వేరే వాళ్లకు అర్ధం కాదు. తాజాగా ఒక మహిళా ప్రాణాలను ఎయిర్ పాడ్ లు రక్షించాయి.
న్యూజెర్సీలో నివాసం ఉండే సుసాన్ పుట్‌మాన్ కు ఎక్కడికి వెళ్ళినా సరే చెవుల్లో ఎయిర్‌పాడ్ లు ఉండాల్సిందే. ఒక రోజు తన పూల దుకాణంలో పని చేస్తున్న సమయంలో పడిపోవడంతో రక్త స్రావం అయింది. అక్కడ ఎవరి సహాయం లేకపోవడంతో ఆమె తన చెవుల్లో ఉన్న ఎయిర్ పాడ్స్ ను గుర్తించి అంబులెన్స్ కు ఫోన్ చేసింది. వెంటనే హే సిరి ఆన్ చేసి అంబులెన్స్ కి కాల్ చేసింది.
‘హే సిరీ, కాల్ 911 అనగానే, “సిరి తక్షణమే 911కి డయల్ చేసిందని ఆమె వివరించింది. పోలీసులు, వైద్యులు వెంటనే వచ్చారని పేర్కొంది. ఎయిర్‌పాడ్‌లు సంగీతాన్ని వినడం కంటే చాలా ఎక్కువగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయని వాటిని సరిగా వాడుకోవాలని సూచించింది. తాను ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఆమె వివరించింది. తన ప్రాణాలు కాపాడిన యాపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఆమె ధన్యవాదాలు చెప్పింది.