పార్లమెంట్ లో 'వాయు కాలుష్యం' - Tolivelugu

పార్లమెంట్ లో ‘వాయు కాలుష్యం’

Air Pollution In Lok Sabha, పార్లమెంట్ లో ‘వాయు కాలుష్యం’

ఢిల్లీ కాలుష్యం లోక్‌సభను  ఉక్కిరి బిక్కిరి చేసింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం, వాతావరణ మార్పులపై సభలో ఆసక్తికరమైన చర్చ సాగింది. పలు పార్టీలు దీనిపై మాట్లాడాయి. హర్యానా, యూపీ, పంజాబ్ లో రైతులు పంట వ్యర్ధాలను తగులబెట్టడాన్ని తప్పుబట్టడం సరికాదని పలు పార్టీల ఎంపీలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో కాలుష్యానికి అదొక్కటే కారణం కాదని బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, బీజేడీ ఎంపీలు అన్నారు. సమస్యపై ముందుగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ మనీష్‌ తివారీ…బీజింగ్‌ లో వాయు కాలుష్యాన్ని సమర్ధవంతంగా నివారించగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేమని అన్నారు. వాయు కాలుష్యమే కాకుండా హిమాలయాల్లో నదులు, సరస్సులు కూడా కాలుష్యమవుతున్నాయన్నారు.
ఢిల్లీలో గాలిని శుద్ధి చేసే టవర్లు నిర్మించేందుకు ఒక్కో ఎంపీ తమ ఎంపీ ల్యాడ్స్ నుంచి రెండు కోట్లు విరాళంగా ఇవ్వాలని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ సాహెబ్ సింగ్ కోరారు. ఎంపీలందరూ ఇక్కడే ఉంటారని, ఇక్కడి నీళ్లే తాగుతారని అన్నారు.
కాలుష్యంపై చర్చ జరుగుతున్నప్పుడు టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్‌ ముఖానికి మాస్క్ ధరించి మాట్లాడారు. దేశానికి స్వచ్ఛ గాలి మిషన్ కావాలన్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp