హిందీ సినిమా ఆత్రంగి రేలోని మొదటి పాట చకా చక్ పాట్ యూట్యూబ్‌ను బాగా షేక్ చేస్తుంది. ఈ పాటలో హీరోయిన్ సారా అలీ ఖాన్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫుల్ గా ఫిదా అవుతున్నారు.గ్రీన్ ఇంకా పింక్ కాంబినేషన్లో సారీ ధరించి స్టెప్పులతో అదరగొట్టింది సారా అలీఖాన్. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పాటకు తమ స్టైల్లో స్టెప్పులేస్తు అదరగొడుతున్నారు. తాజాగా ఎయిర్ హోస్టె్స్ మీనాక్షి మరోసారి తన స్టైల్లో ఈపాటకు స్టెప్పులేశారు.
స్పైస్ జెట్ ఎయిర్ హెస్టెస్ అయిన ఉమా మీనాక్షి.. గతంలో నవ్రాయ్ మఝీకి పాటకు డాన్య్స్ చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఈసారి సారా అళీ ఖాన్ నటించిన చకా చక్ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఉమా మీనాక్షి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయగా.. ఈ పాట తెగ వైరల్ అవుతుంది. అందులో ఉమా మీనాక్షీ.. ఖాళీగా ఉన్న విమానంలో డ్యాన్స్ చేసింది. అందులో తన ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ సినిమాలో ధనుష్ ఇంకా అజయ్ దేవ్‌గణ్ నటించారు.ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ‘ఆత్రంగి రే’ చిత్రం డిసెంబర్ 24 వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‌స‍్టార్‌లో విడుదల కానుంది.
Advertisements