విమానాల కొనుగోలు డీల్ లో తిరకాసు తలెత్తి ఈ డీల్ రెండుగా ‘చీలిపోయింది’. . తాజాగా ఎయిరిండియా 250 కొత్త విమానాల కొనుగోలు కోసం అమెరికాకు చెందిన ఎయిర్ బస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే సమయంలో మరో 250 విమానాల కోసం బోయింగ్ సంస్థతో కూడా అగ్రిమెంట్ అయింది. సుమారు 100 బిలియన్ డాలర్ల వ్యయంతో ఇంత భారీ సంఖ్యలో ఇన్ని విమానాల కొనుగోలుకు ప్రభుత్వం యత్నించడం విశేషం.
ఎయిర్ బస్, దాని ప్రత్యర్థి అయిన బోయింగ్ సంస్థతో గత డిసెంబరులో లాంఛనంగా ఒప్పందం కుదిరింది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. బహుశా వచ్చేవారం ఎయిరిండియా అఫీషియల్ ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. ఎయిర్ బస్, ఎయిరిండియా మధ్య శుక్రవారం డీల్ కుదరగా, గత జనవరి 27 నే బోయింగ్ సంస్థతో కూడా ఒప్పందం చేసుకుంది ఈ సంస్థ.
టాటా ఆధీనంలోకి ఎయిరిండియా వచ్చిన ఏడాదికి ఈ పరిణామాలు జరిగాయి. వీటిపై ఎయిర్ బస్ గానీ, ఎయిరిండియా గానీ స్పందించడానికి నిరాకరించాయి. తాము చరిత్రాత్మక ఆర్డర్ ని పొందామని జనవరి 27 న ఎయిరిండియా తన ఉద్యోగులకు తెలిపింది. ప్రస్తుతమున్న పాత విమానాల స్థానే కొత్తవి, అధునాతన ప్లేన్స్ ను కొనాలన్నది ఈ సంస్థ లక్ష్యం.
దేశంలోనూ, విదేశాల్లోనూ తన ప్రతిష్టను పెంచుకోవాలని ఈ సంస్థ భావిస్తోంది. 2000 సంవత్సరంలో ఎయిరిండియా ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంది. ఆ సందర్భంలో పడిపోయిన తన పేరు ప్రఖ్యాతులను పునరుద్ధరించుకోవాలని ఇప్పుడు ఇన్ని విమానాల కొనుగోలు కోసం కసరత్తు ప్రారంభించింది.