నెల్సన్ దిలీప్‌కుమార్, రజనీకాంత్ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇందులో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా నటించనుందట. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయట.
గతంలో రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ రోబో సినిమాలో నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ఇప్పుడు 11 సంవత్సరాలు తరువాత మళ్ళీ ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.
నెల్సన్ దిలీప్ కుమార్ బీస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవల డాక్టర్ వరుణ్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు దిలీప్‌కుమార్. రజినీకాంత్ విషయానికి వస్తే పొంగల్ సందర్భంగా విడుదలైన అన్నాత్తే తో మంచి హిట్ ను అందుకుని నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాడు.