చెన్నైలో బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, కూతురు ఆరాధ్య బచ్చన్ సందడి చేశారు. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియన్ సెల్వన్-1. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో హిట్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకుపోతోంది.
కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా చూసేందుకు ఐశ్వర్యరాయ్ బచ్చన్, కూతురు ఆరాధ్య తో కలిసి చెన్నైకి వచ్చారు. సినిమా విడుదలైన తర్వాత డైరెక్టర్ మణిరత్నం చెన్నైలో నటీనటులు, సిబ్బంది కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చారు. చియాన్ విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ, విక్రమ్, సుహాసిని, ప్రభు తదితరులు కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేశారు.
సినిమా చూసి బయటకు వచ్చిన ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్య చిత్ర బృందంతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ మూవీ చాలా బాగా వచ్చిందని చెప్పారు. ప్రసిద్ధ తమిళ సాహిత్య నవల ఆధారంగా పొన్నియన్ సెల్వన్ ను తెరకెక్కించారు.
ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు. మరో తొమ్మిది నెలల్లో ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా విడుదల కానుంది. ప్రస్తుతం రెండో భాగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.