సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా అత్యధిక కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇకపోతే మహేష్ బాబు తన తదుపరి చిత్రం రాజమౌళి కాంబినేషన్లో షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు.
ఇక ఈ సినిమాకి అర్జునుడు అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలపగా.. అధికారికంగా అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. ఇకపోతే ఈ సినిమాపై చిత్ర యూనిట్ భారీ అంచనాలతో ఉంది. కానీ.. చిత్రానికి సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తామని ప్రకటించారు.
రాజమౌళి దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అద్భుతమైన కథను అందించినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. అంతేకాదు విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంత అద్భుతమైన కథ మహేష్ బాబు కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Advertisements
ఇక ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ ఒక కీలక పాత్రలో నటించబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ ఇప్పటికే ఐశ్వర్య రాయ్ ని కలిసినట్టు.. ఆమె కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే షూటింగ్ ప్రారంభం అయ్యే వరకు ఎదురు చూడక తప్పదంటున్నారు సినీ ప్రముఖులు.