ఐశ్వర్యా రాజేష్.. తండ్రి రాజేష్ మల్లెమొగ్గలు హీరో..! మేనత్త శ్రీలక్ష్మి మాంచి కమెడియన్…! తాత అమరనాథ్ నటుడు…! ఆర్ధికంగా అంతగా బాగా స్థిర పడలేదు. తండ్రి, ఇద్దరు సోదరులు చనిపోయాక తను, తన తల్లి, మరో సోదరుడు అష్టకష్టాలూ పడ్డారు. ఎలాగైనా మూవీల్లో రాణించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది ఐశ్వర్య. నల్ల పిల్ల సినిమాలకు పనికిరాదని అన్నారు. కానీ, తమిళ్ మూవీల్లో పట్టుదలతో అవకాశాలు సాధించి ఐశ్వర్యారాజేష్ అనే ముద్ర వేసుకుంది. తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి మూవీ ద్వారా మంచి సక్సెస్ పొందింది.
చిన్నప్పుడు రాంబంటు మూవీలో బాలనటిగా రాజేంద్రప్రసాద్‌తో నటించింది ఈమే. ఇప్పుడు కౌసల్యా కృష్ణమూర్తిలో ఆయన కూతురిగా మెప్పించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు బాగా పేరురావడంతో ఓ డజను సినిమాలు చేతికి వచ్చాయి. ఈ సమయంలో క్రేజీ డైరెక్టర్ శంకర్ మూవీ ఆఫర్ వచ్చింది. ఒక్క సినిమా కోసం రెండేళ్లు కేటాయించే కంటే చిన్న సినిమాలతో ఇల్లే బంగారం చేసుకుందామని ఐశ్వర్యా రాజేష్ నిర్ణయించుకుంది. అదీ తెలివంటే…! కుటుంబ అనుభవాలే జీవిత పాఠాలు నేర్పుతాయి…!