పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలను ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమాను కంప్లీట్ చేశాడు. అయితే ఇప్పుడు లైన్ లో క్రిష్ ,హరీష్ శంకర్, సాగర్ కె చంద్ర, సురేందర్ రెడ్డి లు ఉన్నారు. లాక్ డౌన్ కి ముందు క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ ను కంప్లీట్ చెయ్యగా ఈ రోజుటి నుండి మిగిలిన షూటింగ్ ను పునః ప్రారంభించాలని యూనిట్ భావించింది. కానీ అనుకోకుండా క్రిష్ కు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ వాయిదా పడింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో నటించబోతుందని ఓ గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపించబోతున్నాడని సమాచారం. పవన్ ని చూసిన ఈ అమ్మడు ప్రేమలో పడుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.