పెద్దోళ్ళ ఇంటిగుట్టు పనివాళ్ళకే తెలుస్తుందంటారు. వాళ్ళు చూసింది ఊహించుకున్నది కొంత వెరసి యజమానుల క్యారెక్టర్ని డిసైడ్ చేసే జడ్జ్ అయిపోతారు. కొబ్బరి చెట్టెందుకు ఎక్కావురా అని అడిగితే పచ్చగడ్డికోసేందుకు అన్నాడట వెనకటికి ఒకడు. ఇదేంటి పరస్పరం సంబంధం లేకుండా.. ఏంటి ఈ గందరగోళం అనుకుంటున్నారా..!?
విషయం ఏంటంటే.రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం అప్పట్లో సంచలనం అయ్యింది. ఇంట్లో బంగారం, నగలను పని మనిషి ఎత్తుకెళ్లిందని కేసు నమోదయ్యింది.దీనిపై విచారణ చేసిన పోలీసులు.. మార్చి 31వ తేదీన పని మనిషి ఈశ్వరిని పట్టుకున్నారు పోలీసులు.
విచారణ చేయగా దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనానికి కారణాలను వెల్లడించిన తీరు వైరల్ అయ్యింది. ఇదే సమయంలో పని మనిషి ఈశ్వరి ఏ మాత్రం తక్కువ తినలేదు. ఇంట్లో బోలెడు డబ్బు, బంగారంతోపాటు కోటి రూపాయల ఇంటి డాక్యుమెంట్లు దొరకటం కలకలం రేపుతోంది.పని మనిషి ఈశ్వరి మాటల్లోనే.. 18 ఏళ్లుగా ఐశ్వర్య ఇంట్లో పని చేస్తున్నాను.
నెలకు కేవలం 30 వేల జీతం మాత్రమే ఇస్తారు.. ఈ 30 వేల రూపాయలతో ఎలా బతకాలి.. ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి.. జీతం తక్కువ కావటంతో దొంగతనం చేస్తున్నానంటూ యజమానులపైనే నెపాన్ని వేసింది.
జీతం బాగా ఇచ్చి ఉంటే.. దొంగతనం ఎందుకు చేస్తానంటూ చెప్పుకొచ్చిందీ పని మనిషి. ఐశ్వర్య పిల్లలు యాత్ర, లింగాలను చూసుకుంటూ ఉన్నానని స్పష్టం చేసింది.
పని మనిషి ఈశ్వరి ఇంట్లో 100 బంగారం ముక్కలు, 30 గ్రాముల డైమండ్ ఆభరణాలు, నాలుగు కేజీల వెండి వస్తులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొంగిలించినట్లు కంప్లయింట్ ఇచ్చిన ఆభరణాల లిస్ట్ కంటే.. ఈశ్వరి ఇంట్లో అధికంగా దొరకటం విశేషం.
ఒకేసారి పెద్ద మొత్తం దోపిడీ చేయటంతో.. గతంలో చేసిన చిన్న చిన్న దొంగతనాలు సైతం ఇప్పుడు బయటపడ్డాయని చెబుతున్నారు పోలీసులు. పని మనిషి ఈశ్వరికి చెన్నైలోని షోలింగనల్లూరు ప్రాంతంలో కోటి రూపాయల విలువ చేసే ఇల్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
18 ఏళ్లుగా నమ్మకంగా పని చేస్తుండటంతో.. ఐశ్వర్య ఇంట్లోనే కాకుండా ధనుష్, రజనీకాంత్ ఇళ్లల్లోనూ అప్పుడప్పుడు పని చేస్తూ ఉంటుంది ఈశ్వరి.ఇన్నేళ్లుగా పని చేస్తున్నా.. జీతం మాత్రం 30 వేల రూపాయలే ఇవ్వటంతో దొంగతనం చేసినట్లు ఇప్పుడు ఐశ్వర్య రజనీకాంత్ పైనే అపవాదులు వేస్తుంది.
దీంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. దీనిపై నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు.. 18 సంవత్సరాలుగా పని చేస్తుంటే.. ఓ సినీ సెలబ్రిటీ 30 వేల జీతమేనా ఇచ్చేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.