మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీ లో మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వం సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె వచ్చారు.
ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడంతో సంబంధిత నటీనటులు హైదరాబాద్ చేరుకుంటున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ అనే చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.