దేశంలో పెరుగుతున్న నిత్యావసరాల, ఇంధన, ఇతర వస్తువుల ధరలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బతకలేని పరిస్థితులు నెలకొన్నాయని మోడీ సర్కార్ పై మండి పడుతున్నాయి.
సామాన్యుడిపై ధరల భారాన్ని మోపారంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దిన్ అజ్మల్ తీవ్రంగా మండిపడ్డారు.
పెరిగిన ధరలతో వంటింటిని ఎలా నెట్టుకొస్తున్నారని బీజేపీ ఎంపీలు వాళ్ల భార్యలను అడగాలని ఆయన అన్నారు. పెరుగుతున్న ధరలకు తక్షణమే కళ్లెం వేయకుండా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ద్రవ్యోల్బణం కూల్చేస్తుందని ఆయన హెచ్చరించారు.
రికార్డుస్ధాయిలో నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంపై మోడీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు విమర్శల బాణాలను సంధిస్తున్నాయి. గత కొద్దినెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం పైకి ఎగబాకుతున్న తీరు పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.