న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 325 పరుగులకు ఆలౌట్ అయింది. అన్ని వికెట్లు అజాజ్ పటేలే తీశాడు. మొత్తం 47.5 ఓవర్లు బౌలింగ్ వేసి 119 పరుగులిచ్చి పది వికెట్లు పడగొట్టాడు.
గతంలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ పది వికెట్ల ఫీట్ సాధించారు. 1956లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై పది వికెట్లు తీశాడు లేకర్. అలాగే 1999లో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్తాన్ పై ఈ ఘనత సాధించాడు. ఇన్నాళ్లకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్.. ఆ రికార్డ్‌ను అందుకున్నాడు.