అజయ్ దేవగన్… బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రాంచరణ్‌లతో రాబోతున్న మల్టీస్టారర్ సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు గాను అజయ్ దేవగన్ భారీ మొత్తాన్ని తీసుకున్నాడని… 30నిమిషాల తన క్యారెక్టర్‌కు 25కోట్లు తీసుకున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రాజమౌళి కావాలనే అజయ్ దేవగన్‌ను పట్టుబట్టి ఒప్పించాడన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
అయితే… RRRసినిమా కోసం అజయ్ దేవగన్ ఎలాంటి చార్జ్ చేయలేదని తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా తనకు ఒక్క రూపాయి కూడా వద్దని నిర్మాతలకు, రాజమౌళికి చెప్పేశాడట. తనకు రాజమౌళి సినిమాలో నటించాలన్నది బలమైన కోరిక అని… ఇప్పుడా కోరిక ఈ సినిమాతో నెరవేరిందని అజయ్ దేవగన్ అన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ సాగుతుండగా…. ఎక్కువ రోజులు సమయం తీసుకోకుండా అజయ్ దేవగన్‌పై తీసే సన్నివేశాలు వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ఉన్నాడట రాజమౌళి.
ఇక ఓవైపు సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే… వచ్చే సంవత్సరం జనవరి 8న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్.