అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం వలిమై. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ హీరో కార్తికేయ నటించాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ హ్యమా ఖురేషీ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా ను ఫస్ట్ డే చూసేందుకు థియేటర్లకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. టపాసులతో సంబురాలు చేసుకుంటున్నారు. కాగా ఆ సమయంలో అక్కడ అపశృతి చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్ థియేటర్ ముందు పెట్రోల్ బాంబు తో కొంతమంది దుండగులు దాడి చేశారు. అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు బైక్ పై పరారయ్యారు.
అయితే ఈ దాడిలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులు కోసం వెతుకుతున్నారు.