హెచ్ వినోథ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వలిమై. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా నడుస్తోంది.
అదేంటంటే వలిమై… చిత్రానికి సంబంధించిన టీజర్ త్వరలో విడుదల కానుందట. ఆ టీజర్ ను ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విధంగా కట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక ఇప్పటి వరకు ఉన్న ఆల్ టైమ్ రికార్డు లను ఈ టీజర్ తో సెట్ చేసే విధంగా ఫ్యాన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.