సినిమా హీరోలు అంటే సినిమాల మీద మాత్రమే పట్టు ఉంటుంది. అగ్ర హీరోలు అయినా సరే వాళ్లకు ఇతర రంగాల్లో అంతగా ఆసక్తి ఉండక సైలెంట్ గా ఉంటారు. కాని కొందరు హీరోలు మాత్రం తమ అభిరుచిని చంపుకునే ప్రయత్నం చేయరు. అందులో అజిత్ ఒకరు. తమిళ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న అజిత్ కి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఇక సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాలు ఉండేలా చూస్తూ ఉంటాడు.
సినిమాల్లోనే కాకుండా పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడే అజిత్ బండితో చాలా దూరం ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ఇక మన సౌత్ లో ఎవరికి లేని ప్రత్యేకత అజిత్ కి ఒకటి ఉంది. అది ఏంటీ అంటే పైలెట్ లైసెన్స్ ఉండటం. విమానాలను నడపడంలో శిక్షణ తీసుకున్న అజిత్ లైసెన్స్ కూడా పొందాడు. ఆ లైసెన్స్ ని రెన్యువల్ కూడా చేయించుకున్నాడు. అతని విమానాన్ని అతనే నడుపుతూ ఉంటాడు.
కొన్ని సందర్భాల్లో తనకు పైలెట్ కావాలి అనే కోరిక ఉండేది అని కాని సినిమాల్లోకి పూర్తిగా వచ్చేసా కాబట్టి అది అలా మిగిలిపోయింది అని చెప్పాడు. మన సౌత్ లో ఏ ఒక్క హీరోకి కూడా ఆ లైసెన్స్ లేదు. తనివు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అజిత్. సినిమా ప్రమోషన్స్ కి గత పదేళ్ళ నుంచి దూరంగా ఉండే అజిత్ ప్రస్తుతం హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు.