మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా మళ్లీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అజిత్ పవార్ పగ్గాలు చేపట్టనున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అల్లుడైన అజిత్ పవార్ ఈ నెల 30 న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలిసింది. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన… ఆ తర్వాత ఫడ్నవీస్ మెజార్టీ నిరూపించుకోలేకపోవడంతో అజిత్ పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి చేరారు.
60 ఏళ్ల అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంగా చేయడానికి శరద పవార్-ఉద్ధవ్ ఠాక్రేల మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని..ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలినట్టు తెలిసింది. అజిత్ పవార్ 2014 లో ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా డిప్యూటీ సీఎం గా పనిచేశారు.