రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా ఖాదీం సల్మాన్ చిస్తీని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మ తల నరికి తెచ్చిన వాళ్లకు తన ఇళ్లు రాసి ఇస్తానంటూ ప్రకటించారు.
ఈ మేరకు ఓ వీడియో సందేశం ఇచ్చాడు. ఆ వీడియోలో…. అన్ని ఇస్లాం దేశాలకు జవాబు ఇవ్వాలని, తాను అజ్మీర్ నుంచి మాట్లాడుతున్నానంటూ, ఇదంతా హుజూర్ ఖ్వాజా బాబాకా దర్బార్ నుంచి వచ్చిన సందేశమని తన వీడియోలో సల్మాన్ చిస్తీ అన్నాడు.
దీనికి సంబంధించిన నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో వీడియో ఆధారంగా చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వీడియోను అజ్మీర్ దర్గా ఆఫీసు దీవాన్ ఖండించారు. అది అతని వ్యక్తిగత సందేశమని, దానికి దర్గాకు సంబంధం లేదని దీవాన్ తెలిపారు.
దర్గా బాబా సల్మాన్‌కు గతంలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు పోలీసు అధికారి దల్వీర్ సింగ్ ఫౌజ్‌దార్ వెల్లడించారు. ఇక ఇప్పటికే ఉదయ్ పూర్, అమరావతి హత్యలు ఆందోళన కలిస్తున్నాయి. ఈ కేసుల్లో ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.