సీఎం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు మెట్రో కారిడార్-2ను ప్రారంభించబోతున్నారని, జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఈ కొత్త రూట్‌తో మరో 11కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని, అన్ని రూట్లు కలిపి ఇప్పటి వరకు 69కి.మీ మెట్రో అందుబాటులో ఉందని ప్రకటించింది.
అయితే, హైద్రాబాద్ మెట్రో సంస్థ ప్రకటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు అన్ని రూట్లు పూర్తి చేసేందుకు డబ్బులుంటాయి కానీ ఎంజీబీఎస్ నుండి ఫలకునుమా లైన్ పూర్తి చేసేందుకు ఫండ్స్ ఉండవా అని ప్రశ్నించారు. దక్షిణ హైదరాబాద్‌పై ఎందుకు ఈ వివక్ష అంటూ ప్రశ్నించారు.
దీంతో… ఓవైసీ ప్రకటన సంచలనంగా మారిపోయింది. సీఎం కేసీఆర్‌తో సత్సంబంధాలున్న అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయాలన్నీ కేసీఆర్‌తో చర్చించకుండా… మెట్రో రైలు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేయటం చర్చనీయాంశంగా మారింది.