అన్ని సినిమాలూ అంచనాల్ని అందుకోవు. కొన్ని సినిమాలు మాత్రం పెర్ ఫెక్ట్ గా ఆ అంచనాల్ని అందుకుంటాయి. ప్రేక్షకులు ఏది ఆశించారో, అవి అందిస్తాయి. బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా అలాంటిదే. బాలయ్య ఫ్యాన్స్ ఆశించిన మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ పుష్కలంగా ఈ సినిమా ఉండడంతో సినిమా మంచి విజయం సాధించింది.
తాజాగా అఖండ సినిమా రన్ పూర్తయింది. కంప్లీట్ రన్ లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 69 కోట్ల 10 లక్షల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. దీంతో ఈ మూవీ బాలయ్య కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇక నైజాంలో ఈ సినిమా సెన్సేషనల్ హిట్టవ్వగా, సీడెడ్ లో కూడా కళ్లుచెదిరే వసూళ్లు సాధించింది. సూపర్ హిట్ అయిన అఖండ సినిమా ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్ చూద్దాం.
అఖండ ఫైనల్ కలెక్షన్
నైజాం – రూ. 19.10 కోట్లు
సీడెడ్ – రూ. 14.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.94 కోట్లు
ఈస్ట్ – రూ. 4.15 కోట్లు
వెస్ట్ – రూ. 3.40 కోట్లు
గుంటూరు – రూ. 4.95 కోట్లు
కృష్ణా – రూ. 3.60 కోట్లు
నెల్లూరు – రూ. 2.56 కోట్లు