నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సింహా లెజెండ్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకుమించి ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలావుండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సమయం వచ్చింది. మొదటి పాట అడిగా.. అడిగా.. లిరికల్ వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం 5:33 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారికంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.