నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం అఖండ రికార్డుల మోత మోగిస్తోంది. చాలా రోజుల తర్వాత ఫుల్ టైం రన్నింగ్ తో థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా కొత్త రికార్డును సాధించింది. డిసెంబర్ 2న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో విజయవంతంగా తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
దీంతో దేశవిదేశాల్లో బాలయ్య ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.
మరోవైపు అఖండ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో.. 50 డేస్ ఫర్ అఖండ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. ఇదిలా ఉంటే అఖండ ఇప్పటికే రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఎల్లుండి నుంచి ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.