నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయం ను సొంతం చేసుకుంది. ఇందులో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్, పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.
ఇక తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఇంత విజయం సాధించడం పట్ల నందమూరి అభిమానులు పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాను.
అంతే కాకుండా ఈ చిత్రం 50 రోజుల మార్క్ పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా జరుపుకోని విధంగా 106 సెంటర్స్ లో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది బాలయ్య మరో సరికొత్త రికార్డని చెప్పాలి.
ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడు ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దునియా విజయ్ కుమార్, వరలక్ష్మీ, శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.