నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. గతంలో బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం హిట్ సాధించింది.
ఇందులో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించారు. జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. 50 రోజులు ఆడిన ఈ చిత్రం ఇటీవలే ఓటిటి లో కూడా రిలీజ్ అయింది.
ఓటిటి లో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రం తమిళ భాషలో డబ్బింగ్ కాబోతుందట. ఇంకా దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.