కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ ను వాయిదా వేసుకుంటూ వచ్చిన ఒక్కో పెద్ద సినిమా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. మొదటిగా గతేడాది డిసెంబర్ లో అఖండ చిత్రం రిలీజ్ అయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా నటించగా తమన్ సంగీతం అందించారు. ఏపీలో టికెట్ల ధరలు తక్కువగా ఉన్న సమయంలో అఖండ చిత్రం రిలీజ్ అయి రికార్డ్స్ బ్రేక్ చేసింది. 58 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 200 కోట్లు కొల్లగొట్టి రికార్డు సృష్టించింది. అఖండ విజయంతో మిగతా సినిమాలకు ఎంతో ధైర్యం వచ్చిందనే చెప్పాలి.
ఈ సినిమా తర్వాత పుష్ప, బంగార్రాజు, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ త్రిబుల్ ఆర్, చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే నిజానికి ఈ పెద్ద సినిమా అన్నింటిలోకి అఖండనే మంచి విజయం సాధించిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్న మాట. అందుకు సంబంధించిన లెక్కలే సాక్షాధారాలు. ఉదాహరణకు తీసుకుంటే గోదావరి జిల్లాలో థియేటర్లలో అఖండ నుంచి స్టార్ట్ త్రిబుల్ ఆర్ వరకూ చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అఖండ సినిమాను 2.50 లక్షలకు కొన్నారు. ఈ సినిమా రెండు వారాల్లోనే 6.50 లక్షల రాబట్టింది. అంటే నాలుగున్నర లక్షల లాభం వచ్చింది. ఇక పుష్ప ,బంగార్రాజు విషయంలో కొద్దిపాటి నష్టాలతో బయట పడ్డారు. భీమ్లా నాయక్ సినిమా ను ఐదు లక్షలకు కొంటె నాలుగు లక్షలు వచ్చింది. అంటే లక్ష రూపాయలు నష్టం వచ్చింది. అలాగే రాధే శ్యామ్ ఐదు లక్షలకు కొంటె రెండు లక్షలు నష్టం వచ్చింది.
ఎన్టీఆర్, చిరు లే కాదు అక్కినేని కూడా సాధించిన ఈ 7 ఇండస్ట్రీ హిట్ సినిమాల గురించి మీకు తెలుసా ?
అలాగే ఆర్ ఆర్ఆర్ సినిమా విషయం చూసుకుంటే 16 లక్షలు చెప్పడంతో ఆలోచించి 14 లక్షల డీల్ తో సినిమాను తీసుకువచ్చారు. కట్ చేస్తే లక్ష రూపాయలు నష్టం వచ్చింది. ఇక రవితేజ కిలాడి సినిమాను లక్ష 25 వేలకు కొంటె కేవలం 37 వేలు మాత్రమే వచ్చిందట. ఇలాంటి లెక్కల మధ్య చూసుకుంటే నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం పెద్ద సినిమాలన్నింటిలో కన్నా బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి.
టాలీవుడ్ లో 100 కి పైగా సినిమాలు చేసిన ఆ 14 మంది హీరోలు ఎవరో తెలుసా ?