నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం రిలీజ్ అయి నేటికి యాభై రోజులు పూర్తిచేసుకుంది ఈ సందర్భంగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. అదేంటంటే ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో చేరిందట.
థియేట్రికల్ గా 150 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం మిగతా 50 కోట్లను నాన్ థియేట్రికల్ గా అందుకుని టోటల్ గా 200 కోట్ల క్లబ్ లో చేరింది.
దీనితోబాలయ్య కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా 200 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయ్యారు. ఇక ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించే శ్రీకాంత్ విలన్ గా నటించిన అలాగే పూర్ణ జగపతిబాబు కీలక పాత్రలో నటించారు.
ఇక బాలయ్య బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన సింహం లెజెంట్ చిత్రాలు ఘనవిజయం సాధించగా ఇప్పుడు ఈ చిత్రం అంతకు మించిన ఘన విజయం సాధించింది. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.