నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాగే నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా దుమ్ము దులిపింది. ఇదిలా ఉండగా ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయ్యి ఇప్పటికి 45 రోజులు అవుతున్నా ఓవర్సీస్ లో అఖండ మాస్ జాతరగా నడుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఇక దీనిపై ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
శ్రీకాంత్ విలన్ గా నటించారు. అలాగే పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఇక ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు.
Don't miss to witness The MASSive Blockbuster Combination #Akhanda🦁 at theatres near you💥
Book Tickets Now🎟 https://t.co/rYIdlfCm8phttps://t.co/AqgnupIHa5#AkhandaMassJathara#NandamuriBalakrishna#BoyapatiSreenu @ItsMePragya @MusicThaman #MiryalaRavinderReddy pic.twitter.com/EBoqIWt4cX
— Dwaraka Creations (@dwarakacreation) January 16, 2022