బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. డిసెంబర్ 2న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అలాగే వసూళ్ల పరంగా కూడా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా దర్శకుడు తెరకెక్కించారు.
అఖండ గా బాలయ్య అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.
ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన మొదటి రోజు ఎక్కువ వ్యూస్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా తాజాగా ఇప్పుడు మరో రికార్డును సృష్టించింది.
ఓటిటి లో మొదటి వారంలో ఎక్కువ వ్యూస్ సాధించిన ఏకైక తెలుగు చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడం పట్ల ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు.