నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. ఈ చిత్రం అఖండమైన విజయం సాధించింది. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతోంది అంటూ కొన్ని వార్తలు వైరల్ కాగా ఆ వార్తలపై క్లారిటీ ఇస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. డిస్నీ+ హాట్‌స్టార్ లో జనవరి 21వ తేదీ నుండి బాలయ్య అఖండ ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే.