నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం అఖండ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది అంటూ ఇటీవల బోయపాటి శ్రీను అనౌన్స్ చేశారు.
అలా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సినిమా ఎలా తీసుకోబోతున్నారు కథ ఏంటి అనేది అందరిలోనూ ఓ ప్రశ్న స్టార్ట్ అయింది. ఈ ప్రశ్నకు సమాధానంగా సోషల్ మీడియాలో వైరల్ ఓ వార్త అవుతోంది.
అదేంటంటే అఖండ క్లైమాక్స్ లో శివుడి పాత్రలో ఉన్న బాలకృష్ణ తన సోదరుడి కూతురికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. అయితే ఈ సీక్వెల్ లో ఆ అమ్మాయి పెరిగి పెద్దగా అవడం, వేరొక విలన్ కథ లోకి ఎంట్రీ అవ్వటం, ఆ విలన్ తో ఈ అమ్మాయికి సమస్య రావడం మళ్లీ అఖండ ఎంట్రీ ఇవ్వడం అనే పాయింట్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి.
ఇక అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. జగపతిబాబు, పూర్ణ కీలక పాత్రలో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మించారు.