నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. థియేటర్స్ లో డిసెంబర్ 2న ఈ చిత్రం రిలీజ్ కాగా ఇటీవల ఓటి టి లో కూడా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఓ గ్రామంలోని మైదానంలో అఖండ ను బిగ్ స్క్రీన్ పై వేసి చూడటం హైలెట్ గా మారింది.అది కూడా కేరళలో.
నిజానికి అఖండ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ భాషల్లో కూడా విజయం సాధించింది. అలాగే మలయాళ వెర్షన్ కు కూడా విశేషమైన స్పందన వచ్చింది. మలయాళ ఫ్యాన్స్ పేజీలు, ట్రోల్స్ పేజీలు కూడా అఖండ తో నిండిపోతున్నాయి.
ఇక ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. అలాగే పూర్ణ, జగపతిబాబు లు కీలక పాత్రలో నటించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మించారు.